పలమనేరు, జూలై 28 ( గరుడ ధాత్రి ) :
నేడు ఆషాడశుద్ధ పూర్ణిమ సందర్భంగా
స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అనుబంధ ఆ లయమైనటువంటి శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం నందు నేడు శాకాంబారి అలంకారం జరుగనున్నది. పలమనేరు ప్రాంతానికి చెందిన
శ్రీ వారి సేవకులు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో అత్యంత సుందరంగా అనేక ఆకృతులలో శాకంబరి అలంకారం చేయడం జరుగుతుందని పలమనేరు పురోహితులు కిషోర్ స్వామి తెలిపారు.ఇందుకోసం పలమనేరు వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి మంగళవారం కూరగాయలను కానిపాకం దేవాలయానికి తరలించారు.కావున పలమనేరు ప్రజలు భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీ కాణిపాకం దేవాలయాన్ని దర్శనం చేయవలసిందిగా స్వామి కోరారు. కార్యక్రమంలో ఇంకనూ స్వామివారి సేవకులు సోమశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
