కార్వేటినగరం ఆగస్టు 1( గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో శనివారం ఉదయం స్వామి అమ్మవార్లకు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద బెంగళూరుకు చెందిన పద్మకృష్ణ, చైతన్య రెడ్డి కృష్ణ క్రిషిక వారి వివాహ దిన సందర్భంగా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ అధికారి వీరాస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం వద్ద జన్మదిన, వివాహ దినోత్సవాల పురస్కరించుకుని ఆలయం వద్ద అన్నదానం చేయదలచిన వారు ముందుగా వారి పేర్లు ఆలయం వద్ద చెప్పితే వారి పేర్లు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
