ePaper
Thursday, August 20, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఉత్తమ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా త్యాగరాజు

ఉత్తమ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా త్యాగరాజు

📰 Generate e-Paper Clip

భరత్‌ పరేఖ్‌ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పురస్కారం

పిచ్చాటూరు ఆగస్టు 19 గరుడధాత్రి :
పుత్తూరు ఎల్‌ఐసీ శాఖకు చెందిన ఏజెంట్‌ వి. త్యాగరాజును ఉత్తమ ఎల్‌ఐసీ ఏజెంట్‌ పురస్కారం వరించింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ స్థాయి ఎల్‌ఐసీ మోటివేటర్‌ భరత్‌ పరేఖ్‌ చేతుల మీదుగా త్యాగరాజు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు.
పాలసీదారులకు మెరుగైన ఆర్థిక భద్రత, పొదుపు ప్రణాళికలపై అవగాహన కల్పిస్తూ బీమా రంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.
ఈ సందర్భంగా త్యాగరాజు మాట్లాడుతూ, భరత్‌ పరేఖ్‌ వంటి ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందని, పుత్తూరు ప్రాంత ప్రజలకు మరింత చేరువై మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
పాలసీదారులు, వారి కుటుంబాల ఆర్థిక భద్రత కోసం అహర్నిశలు పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఆదరిస్తున్న పాలసీదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అవార్డు అందుకున్న వి. త్యాగరాజును పలువురు ఎల్‌ఐసీ అధికారులు, తోటి ఏజెంట్లు, పాలసీదారులు, కస్టమర్లు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!