ePaper
Thursday, August 20, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కూరపాటి శంకర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పిచ్చాటూరు తెదేపా నాయకులు

కూరపాటి శంకర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పిచ్చాటూరు తెదేపా నాయకులు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు ఆగస్టు 19 గరుడధాత్రి :

సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ కూరపాటి శంకర్‌రెడ్డిని పిచ్చాటూరు మండల టీడీపీ నాయకులు తిరుపతిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై నాయకులు శంకర్‌రెడ్డితో చర్చించారు. మండల అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు కె. సతీష్‌ నాయుడు, పిచ్చాటూరు మండల టీడీపీ మాజీ అధ్యక్షులు ఎం. తిరుమలై రెడ్డి, శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయ ఛైర్మన్‌ పద్మనాభ రాజు, సీనియర్‌ నాయకులు సురేష్‌బాబు నాయుడు, వెంకటేసులు నాయుడు, మునిరాజు, సుదర్శనం నాయుడు, సతీష్‌ నాయుడు, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!