కార్వేటినగరం అక్టోబర్ 2 ( గరుడదాద్రి న్యూస్):
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా విశిష్టమైన కృషిని గుర్తించి, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత, ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ పై నిషేధం అమలు కార్యక్రమం అమలు, అలాగే స్థిరమైన వ్యర్థాల నిర్వహణ పద్ధతుల అమలు పై చిత్తూరు జిల్లా స్థాయి లో కార్వేటినగరం గ్రామ పంచాయతీని స్వచ్ఛ గ్రామ పంచాయతీగా ఎన్నిక కాబడినది. ఇందులో భాగంగా శ్రీ బి.వి.మధుసూదన్, డిప్యూటీ మండల పరిషత్తు అభివృద్ధి అధికారి, రాధికా సింగిరెడ్డి కార్వేటినగరం వారు అవార్డు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గు మల్లప్రసాద్ చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ వారి చేతుల మీదుగా బి.వి.మధుసూదన్ అవార్డు అందుకోవడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేయుచున్న యావన్మంది సిబ్బంది కృషి మరియు పంచాయితీ ప్రత్యేక అధికారాధికా సింగిరెడ్డి, మండల పరిషత్తు అభివృద్ధి అధికారి వారి ప్రోత్సాహం వలన ఈ అవార్డు స్వీకరించడం చాలా ఆనందంగా ఉన్నదని తెలుపుతూ మున్ముందు కూడా కార్వేటినగరం గ్రామ పంచాయతీని అన్ని విధముల అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని తెలిపినారు
