ePaper
Friday, October 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ మోహన్ రెడ్డి

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ మోహన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

పలమనేరు, అక్టోబర్ 07 ( గరుడ ధాత్రి ) :
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలమనేరు పట్టణంలో అధికారులు ముందస్తు చర్యలు ముమ్మరం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా బుధవారం పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మోహన్ రెడ్డి, మున్సిపల్ సిబ్బందితో కలిసి పట్టణ పరిధిలోని పలు పోలింగ్ బూత్‌లను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనను వారు పరిశీలించారు. ఎన్నికల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ టిపిఎస్ ఇందిరా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!