ePaper
Friday, October 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసులు రెడ్డి

ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసులు రెడ్డి

📰 Generate e-Paper Clip

*పలమనేరు, అక్టోబర్ 08 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు శాసనసభ్యులు ఎన్. అమరనాథ రెడ్డిని నూతన ఎఫ్‌ఆర్‌వో ఈ.జే. శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని అటవీ ప్రాంతాల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ చర్యలు, అటవీ సరిహద్దు గ్రామాల సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చించారు. అటవీ సంపదను కాపాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాఖాపరమైన విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది మరియు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!