-తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల నమోదు అధికారి శారదా దేవి
ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ దరఖాస్తులు అందించి, పూరించిన వాటిని జులై 14 లోపు సేకరించి ఆన్లైన్ చేయాలని 167 తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల నమోదు అధికారి శారదా దేవి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఓటర్ నమోదు, యోగాంద్ర – 2026, తల్లికి వందనం అంశాలపై అధికారులు, సూపర్ వైజర్లు, స్వర్ణ వార్డు కార్యదర్సులతో సమావేశం నిర్వహించారు. అత్యంత కీలకమైన ఎన్యుమరేషన్ ఫారం పంపిణీ కార్యక్రమం సోమవారం నుండి ప్రారంభం అవుతుందని తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు మీ పోలింగ్ కేంద్ర పరిధిలోని బూతులెవల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకొని ఇంటింటికి వెళ్లి ఆ కుటుంబంలోని ఓటర్లకు ఎన్యుమరేషన్ దరఖాస్తులను పంపిణీ చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియను ఒక వారంలో పూర్తి చేయాలని, అలాగే ఒక వారం తర్వాత ఓటరు చే నింపబడిన ఎన్యుమరేషన్ పారాలను సేకరించాలని తెలిపారు. కనీసం మూడుసార్లు అయినా ఆ ఇంటిని సందర్శించి, ఎన్యుమరేషన్ పారమ్ నింపడంలో సందేహాలు ఉంటే సాయం అందించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని జులై 14 లోపల పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంద్ర కార్యక్రమం రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని తెలిపారు. ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవన శైలి పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ఈ యోగాంద్ర లో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని తెలిపారు. తల్లికి వందనం అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కార్యదర్సులు తగు చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహాయ ఓటర్ల నమోదు అధికారులు అమరయ్య, సురేష్ బాబు, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, రెవిన్యూ అధికారి సేతుమాదవ్, సెక్రటరీ శ్రీవిద్య, ఎన్నికల ఉప తాసిల్దారు సుధాకర్ నాయక్, ఏసిపిలు పార్వతి ప్రియ, మూర్తి, డీఎఫ్ఓ శ్రీనివాసరావు, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ మధు , తదితరులు ఉన్నారు.
