బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్12
బైరెడ్డిపల్లి గ్రామ దేవత
శ్రీ భాటగంగమ్మ ఆలయంలో శుక్రవారం ఉదయం అమ్మవారి nమూలవర్లకు పంచామృత అభిషేకం ను అర్చకులు నాగేంద్రస్వామి చే పట్టారు.అనంతరం రాత్రి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేపట్టి విశేష పూజలు చేశారు. అలాగే ఆర్యవైశ్య ల ఆరాధన దైవం శ్రీ కన్యకాపరమేశ్వరి దేవికి అభిషేకం ను అర్చకులు రామకృష్ణమాచార్యులు చే కొనసాగింది.రాత్రి అమ్మవారి ఉత్సవ మూర్తికి పూజలు చేసి ఉంజలసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మహిళా మండలి సభ్యులు కనకధార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పటించారు. .అనంతరంమహా మంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉభయదారులు : నాగమణి మరియు డి వి శివకుమార్ కుటింభీకులు, భక్తులు పాల్గొన్నారు.
