ePaper
Friday, October 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅలివేలుమంగాపురంలో బాబు యాదవ్‌ జోరు!

అలివేలుమంగాపురంలో బాబు యాదవ్‌ జోరు!

📰 Generate e-Paper Clip

టీడీపీ శ్రేణులతో విస్తృత ఎన్నికల ప్రచారం

అభివృద్ధికి చంద్రబాబే చిరునామా

టీడీపీకి పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి

సత్యవేడు, అక్టోబర్ 30 గరుడధాత్రి :

సత్యవేడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సత్యవేడు మండలం అలివేలుమంగాపురం గ్రామంలో కన్నవరం ఎంపీటీసీ అభ్యర్థి నాదముని బాబు యాదవ్‌ గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా బాబు యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు చిరునామాగా నిలుస్తారని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొని పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణతో కన్నవరం ఎంపీటీసీ స్థానంలో విజయం సాధిస్తానని బాబు యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!