ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికూటమి వైపే చిత్తూరు ప్రజలు ఉన్నారు

కూటమి వైపే చిత్తూరు ప్రజలు ఉన్నారు

📰 Generate e-Paper Clip

ఓటు వేసే ముందు అభివృద్ధిని చూసి ఓటు వేయండి

—ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్

—ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు

చిత్తూరుఅక్టోబర్30(గరుడదాత్రిన్యూస్)చిత్తూరులో కూటమి వైపే ప్రజలు ఉన్నారని. ఓటు వేసే ముందు అభివృద్ధిని ఆలోచించి ఓటు వేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఓటర్లను కోరారు. నగర పాలక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఈ ఇవారం.గాయత్రి నగర్. కాజూరు. శంకరయ్య గుంట.ఎంజీఆర్ నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి మేయర్ అభ్యర్థి కటారి హేమలతను గెలిపించాలని కరపత్రాలు ఇస్తూ ఓటర్లకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.చిత్తూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నిరంతరం శక్తి వంచన లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాడని తెలిపాడు. ఎమ్మెల్యే గురజాల మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వం వైపేమొగ్గుచూపుతున్నారని,గడిచిన రెండింటిన్నర సంవత్సరాలు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ తో ఎన్నికల హామీలను నెరవేర్చడమే కాకుండా, అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ మంచి పాలన అందిస్తుందని తెలిపాడు.మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ గతంలో మేయర్ గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చిత్తూరు అభివృద్ధిని చేశానని రెండోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని హేమలత ఓటర్లను కోరారు.ఈ ఎన్నికల ప్రచారంలో కార్పొరేటర్లు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు
–

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!