ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కోలాహలం గా శ్రీకృష్ణ జయంతి వేడుకలు

కోలాహలం గా శ్రీకృష్ణ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్4

దేవకి, వసుదేవ
సుతుడు, కంసహరుడు, భగవద్గీతను బోధించిన, శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినమైన శ్రీ పరాభవ నామ సంవత్సరం, శ్రావణమాసం, కృష్ణపక్ష అష్టమి, రోహిణి నక్షత్రం, శుక్రవారం రోజు మండల కేంద్రమైన బైరెడ్డిపల్లి లో పురోహితులు మురళీధర్ ఆచార్యులు ఆధ్వర్యంలో పలు గృహాలలో కృష్ణాష్టమి వేడుకలు భక్తి,శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహాన్ని ప్రతిష్టించి కమనీయంగా సుగంధ పుష్పాలతో అలంకరించి, పంచామృత స్నానాలతో, అర్గ్యప్రధానం గ్రావించారు. ధూప, దీపాలతో స్వామివారికి ప్రీతికరమైన 108 రకాల పిండి వంటలను నైవేద్యముగా సమర్పించారు. పురోహితులు మురళీధర్ ఆచార్యులు శ్రీకృష్ణ, కుచేల వ్రతకథను భక్తులకు చదివి వినిపించారు.ముతైదువులకు పసుపుకుంకం,తాంబులాలు, ప్రసాదంను పంపిణీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!