సత్యవేడు ఆగస్టు 11 గరుడధాత్రి :
కేంద్రంలోని బిజెపి ప్రజా వ్యతిరేక పాలనను నిరసించండి అని సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు ఆరు నుండి ఆగస్టు 14 వరకు దేశవ్యాప్త ప్రచార పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలో పాదయాత్ర కరపత్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ సత్తిబాబు నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్ని రాజ్ మాట్లాడుతూ.
కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వలు దేశ సంపదను కార్పొరేట్లకు దోశి పెడుతూ దేశ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించడంలో అందరికీ విద్యా వైద్యం అందుబాటులోకి తేవడంలో విఫలమయ్యాయని రైతులకు పంట గిట్టుబాటు ధర ఎం ఎస్ పి కల్పించలేదని చిన్ని రాజు ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయించి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు అలాగే ప్రతి యువకులకు ఉద్యోగం కల్పించాలని మహిళా రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని కార్మికుల హక్కులు కాపాడాలని దళిత ఆదివాసులపై అకృత్యాలు దాడులను నిలిపివేయాలని దేశ సార్వభౌమ అధికరణ కాపాడి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని దేశ రాజ్యాంగానికి విఘాతం కలగకుండా పరిపాలించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేయాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇంటి స్థలాలు లేని ప్రజలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు రెండు సెంట్లు వెంటనే ఇవ్వాలని అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని 22Aక్రింద ఉన్న భూములను రైతులకు సంపూర్ణ హక్కు కల్పించాలని చిన్ని రాజ్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ట్రెజరర్ ధనంజయల్ శెట్టి. ఏ ఐ టి యు సి సత్యవేడు నియోజకవర్గ కార్యదర్శి చంద్ర ఏఐవైఎఫ్ నాయకులు నాగార్జున స్థానిక రైతు నాయకులు రవి. ధనుంజయ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
గాడి తప్పిన మోడీ పాలన నిరసిద్ధం- సిపిఐ
RELATED ARTICLES
