ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్చంద్రబాబుతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి

చంద్రబాబుతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి

📰 Generate e-Paper Clip

కుప్పం రూరల్ టిడిపి అధ్యక్షులు రాజగోపాల్
కుప్పం,ఆగస్టు 05 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు తోనే సాధ్యమని కుప్పం రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజగోపాల్ అన్నారు. బుధవారం కుప్పం రూరల్ మండలం ఊర్ల ఓబనపల్లి పంచాయతీ జీడి వంక గ్రామంలో నూతన సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 28 లక్షల రూపాయలు మంజూరు అయిందన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు, మణి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!