-వరుస చోరీలతో ఆందోళనలో గ్రామస్థులు
దొంగలను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్14
మండల కేంద్రం అయిన బైరెడ్డిపల్లి లో చెక్‌పోస్ట్నాలుగు కూడళ్లు వద్ద వీకోట రహదారి లో నాగరాజనాయుడు చిల్లర దుకాణంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం పైకప్పు రేకులు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించి సిగరెట్ బండిళ్లతో పాటు వివిధ రకాల సరుకులను అపహరించినట్లు బాధితుడు నాగరాజనాయుదు పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం దుకాణం తెరిచిన సమయంలో చోరీ జరిగిన విషయం గుర్తించిన ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తుంది.
ఇటీవల మండల కేంద్రంలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో వ్యాపారులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత పెంచి చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
