ePaper
Friday, October 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచెరగని ముద్ర- చెదరని చరిత్ర

చెరగని ముద్ర- చెదరని చరిత్ర

📰 Generate e-Paper Clip

* న్యూజెర్సీ లైబ్రరీలో ‘చంద్రబాబు’ పుస్తకం.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 07 (గరుడ ధాత్రి న్యూస్): అంతర్జాతీయ వేదికపై తెలుగువారి ఆత్మగౌరవ జెండా మరోసారి సగర్వంగా రెపరెపలాడింది. విజన్, దూరదృష్టికి నిలువెత్తు నిదర్శనమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పుస్తకం అమెరికాలోని ప్రముఖ న్యూజెర్సీ స్టేట్, ఎడిసన్ సిటీ లైబ్రరీలో కొలువుదీరింది. విదేశీ గడ్డపై తెలుగు నాయకుడి జీవిత విశేషాలకు చోటు దక్కడం ప్రతి ఒక్క తెలుగువారికీ గర్వకారణంగా మారింది. ఆధునిక ఐటీ విప్లవానికి, నవ్యాంధ్ర నిర్మాణానికి పునాదులు వేసిన చంద్రబాబు నాయుడు పాలనా దక్షత, విజన్ ప్రపంచ నాయకత్వానికి స్ఫూర్తిగా నిలిచాయి. చరిత్ర పుటల్లో ఆయన పేజీ ఎప్పుడో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఆ చెరగని సంతకాన్ని ఎవ్వరూ చెరిపివేయలేరు. చంద్రబాబు నాయుడు పేరున పుస్తకం కొలువు తీరడం పట్ల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!