తిరుపతి, ఆగష్టు 7 :
తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ శుక్రవారం తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారిద్దరూ రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా సమీక్షించుకున్నారు. ఎమ్మెల్యేని శాలువాతో ఘనంగా సత్కరించి తన అనుచర నాయకులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్య దర్శులు పుష్పావతి యాదవ్, బుల్లెట్ రమణ, పార్టీ నాయకులు పెరుమాళ్ మధు, ప్రమోద్, రత్నం, సతీష్, నందగోపాల్, ఖాజా లు పాల్గొన్నారు.
డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం ఇంటికి విచ్చేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే
RELATED ARTICLES
