ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పీజీఆర్‌ఎస్, డైలీ గ్రీవెన్స్ కార్యక్రమాలకు తాత్కాలిక విరామం
ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నిలిపివేత: కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, అక్టోబర్ 24 గరుడదాత్రి:
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), డైలీ గ్రీవెన్స్ కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన వివరాలు వెల్లడించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
– ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నిలిపివేత
అక్టోబర్ 14 నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల స్థాయిల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే డైలీ గ్రీవెన్స్ కార్యక్రమాలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు.
ప్రజలు గమనించాలి: జిల్లా కలెక్టర్
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ మార్పులను ప్రజలు గమనించాలని కలెక్టర్ కోరారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పీజీఆర్‌ఎస్ కార్యక్రమాలు నిర్వహించబడవని స్పష్టం చేశారు.
