కుప్పం,ఆగస్టు 04 (గరుడ ధాత్రి న్యూస్):మాజీ మంత్రి, తెలుగు భాషా పరిరక్షకుడు దివంగత మండలి వెంకట కృష్ణారావు జయంతి సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు భాషా వికాసానికి, సమాజ శ్రేయస్సుకు మండలి వెంకట కృష్ణారావు అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు సంస్కృతి పరిరక్షణలో ఆయన చూపిన బాట అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు.
తెలుగు భాషా పరిరక్షకుడికి సిఎం చంద్రబాబు ఘన నివాళి
RELATED ARTICLES
