కార్వేటినగరం అక్టోబర్ 3 గరుడదాద్రి న్యూస్
ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఇప్పటికే ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారని కావున ఆ నష్టాన్ని పూడ్చాలంటే వీలైనంత త్వరగా దీపావళికి 30% ఐ ఆర్ ప్రకటించాలని ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే చలపతిరావు గిరిబాబు యాదవ్ లు ప్రభుత్వాన్ని కోరారు . ప్రభుత్వం ఇచ్చిన హామీలు అయినటువంటి గత పిఆర్సి అరియర్స్, డి ఏ అరియర్స్ ను సాధ్యమైనంత త్వరలో మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంవత్సరంలోపు సి పి ఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని కావున పాత పెన్షన్ పునరుద్ధరణకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్ సంఘం నాయకులు చిట్టిబాబు, అమర్నాథ్ రెడ్డి ,లక్ష్మీపతి ,రుద్ర మూర్తి, గోవర్ధన్ శెట్టి ,సురేంద్రబాబు, కృష్ణమూర్తి, వరదరాజులు, దినకర్ ,దేవానంద్ ,సురేష్ బాబు ,రెడ్డి వాణి , యుగంది లు పాల్గొన్నారు.
