ePaper
Sunday, September 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాగలాపురం మండల ప్రత్యేక అధికారిగా బాలాజీ నాయక్ బాధ్యతల స్వీకరణ

నాగలాపురం మండల ప్రత్యేక అధికారిగా బాలాజీ నాయక్ బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు నాగలాపురం మండల ప్రత్యేక అధికారిగా మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ నాయక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం బాలాజీ నాయక్ మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!