* రాష్ట్ర ఐటీ విద్యాశాఖామంత్రి నారా లోకేష్.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 01(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్):నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ,నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని అన్నారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రిక్రూట్ మెంట్ మోడల్‌ను ఆసక్తిగా గమనిస్తోంది, మనం అనుసరిస్తున్న విధానాలనే ఇతర రాష్ట్రాలు అనుసరించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ‘మిషన్ మార్చ్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.
