కార్వేటినగరం జూలై 28(గరుడ దాద్రి న్యూస్): కార్వేటినగరం మేజర్ పంచాయతీ బాలాజీ కాలనీ వద్ద వెలసిన సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం 8:30 నుండి 11 గంటల వరకు షిర్డీ సాయి వ్రతం జరుగుతుంది. మధ్యాహ్నం ఆలయ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రాయల్ చెరువు, లతా బాలాజీ, ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు రామిశెట్టి రాజశేఖర్, కోశాధికారి గౌతమ్ రాజు, ఉప కోశాధికారి చిరంజీవి రెడ్డి భక్తులు కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
