ePaper
Sunday, June 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పాము కాటుతో మహిళ మృతి

పాము కాటుతో మహిళ మృతి

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం పెద్ద పాండూరు పంచాయితీ సిద్దేశ్వర పురం గ్రామంలో ముని కిష్టయ్య సతీమణి జమున(45) ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో పాముకాటుకు గురైంది. విద్యుత్ ఆగి రావడంతో చీకట్లో నాగు పాము ఇంటిలో కరిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అది గమనించిన గ్రామస్తులు దగ్గరలో ఉన్న చిన్న పాండూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం సత్యవేడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే లోపు ఆమె మరణించినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. జమున మృతికి సిద్దేశ్వరపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!