ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పిచ్చాటూరులో విజయవంతంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం

పిచ్చాటూరులో విజయవంతంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు జూలై 27 గరుడధాత్రి :
పిచ్చాటూరు మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ -పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ స్వీకరించారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, ప్రతి అర్జీని పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. మండల ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!