ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పిచ్చాటూరు మండల రైతులు అప్రమత్తంగా ఉండాలి- ఎస్సై బి. రాఘవేంద్ర

పిచ్చాటూరు మండల రైతులు అప్రమత్తంగా ఉండాలి- ఎస్సై బి. రాఘవేంద్ర

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, ఆగస్టు 1 గరుడధాత్రి: పిచ్చాటూరు మండలంలోని రైతులు, గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ ఎస్సై బి. రాఘవేంద్ర సూచించారు.
ఇప్పటికే మండలంలోని నీరువాయి మరియు వేలూరు గ్రామాల్లో రైతుల వ్యవసాయ మోటార్లకు సంబంధించిన స్టార్టర్లు, విద్యుత్ వైర్లు గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించిన ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో మండలంలో ఎవరైనా గుర్తుతెలియని లేదా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పిచ్చాటూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
రైతులు తమ వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లు, విద్యుత్ సామగ్రిని భద్రంగా ఉంచుకోవడంతో పాటు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటే ఇలాంటి దొంగతనాలను అరికట్టడం సాధ్యమవుతుందని ఎస్సై బి. రాఘవేంద్ర తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!