కార్వేటి నగరం అక్టోబర్ 30 గరుడదాద్రి న్యూస్
ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల విధులకు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు: వినియోగించుకునేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి ఆర్ శివ ప్రసాద్ తెలియజేశారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కోసం నవంబర్ ఒకటో తేదీ మరి రెండవ తేదీల్లో కార్వేటి నగరం మండల ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక పోస్టల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి శివప్రసాద్ తెలియజేశారు ఇందుకు సంబంధించి ఉద్యోగులు వాటర్ గుర్తింపు పత్రం ఎన్నికల విధుల నియామక పత్రం ఆధార్ కార్డు తో పాటు స్వయంగా హాజరై పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి తెలియజేశారు అర్హులైన ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో రాధిక సింగేరి తాసిల్దార్ కే నాగరాజు పాల్గొన్నారు
