– అరుణ పారాయణం సూర్య యంత్ర పూజ
– సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్ రాజు
నారాయణవనం సెప్టెంబర్ 20 గరుడదాత్రి న్యూస్
పుత్తూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరుగుతున్న విశ్వగురు మహా సంకల్ప సిద్ది యాగంలో భాగంగా 6వరోజు ఆదివారం వేద పండితులు ఉదయం 8.30 గంటల నుండి 12 గంటల వరకు అరుణ పారాయణం మరియు సూర్య యంత్ర పూజ నిర్వహించారు. యాగముకు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు.సాయంత్రం 4 గంటల నుండి ప్రవచన కర్త డా॥ నారాయణం తనూజ్ విష్ణువర్ధన్ కళ్యాణం వైశిష్టత అనే అంశంపై ప్రరచనాలు భక్తులకు వివరించారు. సాయింత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు స్వామి వారి కళ్యాణం సంధర్భంగా కళ్యాణం – విశిష్టత గురించి తెలియజేశారు. స్వామి వారి కళ్యాణం అనంతరం అన్నదానం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు అందుకున్నారు.ఎలైట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం , సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ అశోక రాజు ఈ మహా సంకల్ప సిద్ధి యాగం చేయడం వల్ల ప్రజలు ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలతో సంతోషంగా జీవించడానికి ఆస్వామి వారి అనుగ్రగం లభిస్తుందని తెలిపారు.7 గంటల నుండి 9 గంటల వరకు వేద పండితులు వరుణ యాగం చేపట్టినారు. సిద్ధార్థ కళాశాల చైర్మన్ అశోక రాజు మాట్లాడుతూ వరుణ యాగం వల్ల వరుణుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిసి చెరువులు, నదులు నిండి ప్రజలకు నీటి సమస్య తీరి రైతులకు వ్యవసాయానికి పుష్కలంగా నీరు లభిస్తుందని తెలిపారు. స్వామివారి కళ్యుణోత్సవంలో భక్తులు ప్రజలు, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని స్వామి వారి కృపా కటాక్షాలు ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు సుఖసంతోషాలతో ఉండడం కోసమే ఈ మహా సంకల్ప సిద్ది యోగం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నానని కళాశాల చైర్మన్ రాజు అన్నారు.
