బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్8
బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థంపి.హెచ్.సి.
వైద్యాధికారి సుస్మిత ఆదేశాల మేరకు తీర్థం జడ్.పి.ఉన్నత పాఠశాలలో విద్యార్థులు కు బాల్యవివాహాల మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈకార్యక్రమంలో డిప్యూటీ హెచ్.ఈ.ఓ. కాంతమ్మ మాట్లాడుతూ చట్టప్రకారం” 18 సం లోపల ఉన్న బాలికలు, 21సం నిండని బాలురకు జరిగే వివాహాన్నే బాల్య వివాహం అంటారు.” కనుక బాల్య వివాహాలను పూ ర్తిగా అరికట్టడానికి చట్టపరమైన, నిభందనలతో పాటు సమాజంలో అవగాహన చాలా ముఖ్య మని బాల్య వివాహాల అనర్థాలు గురించి, మరియు బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం అని చెప్పడం జరిగింది. అలాగే యుక్త వయసు ఉన్న వారికి శరీరంలో జరిగే మార్పులు గురించి వ్యక్తిగత శుభ్రత, హ్యాండ్ వాష్ మరియు పరిసరాల పరిశు బ్రత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్.ఎం. లక్ష్మీ పతి ,హెచ్.ఎస్. తిరుమల,ఏ.ఎన్.ఎం. యా స్మిన్ , ఆశ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
