ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మహాలక్ష్మి దీప పూజ ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి జేఈవో మరియు ఎమ్మెల్యే

మహాలక్ష్మి దీప పూజ ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి జేఈవో మరియు ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

పలమనేరు, ఆగస్టు 12 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 14న శ్రావణ శుక్రవారం రోజున జరగనున్న శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం ఏర్పాట్లను బుధవారం సాయంత్రం టీటీడీ జేఈవో శరత్ మరియు, పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి పరిశీలించారు. సుమారు 2000 మందికి పైగా పాల్గొననున్న ఈ దీప పూజా కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా సౌకర్యాలు ఉండాలని అధికారులకు వారు సూచనలు చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో స్త్రీ మూర్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార పరిషత్ చైర్మన్ మేడసాని మోహన్, సీఈవో శ్రీ లతో పాటు పలమనేరు నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!