* భువనేశ్వరి ఆహ్వానంతో హర్షం వ్యక్తం చేసిన మహిళలు.
కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్): మహిళలతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అల్పాహారం తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం చేరుకున్న నారా భువనేశ్వరి శాంతిపురం మండలం శివపురంలోని స్వగృహంలో ఉంటున్నారు. రెండో రోజు మంగళవారం ఉదయం నారా భువనేశ్వరిని కలిసేందుకు పెద్ద ఎత్తున మహిళలు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి వద్దకు చేరుకున్న మహిళలు అందరినీ నారా భువనేశ్వరి నవ్వుతూ పలకరించారు. అందరినీ తనతోపాటు అల్పాహారం తీసుకునేందుకు ఆహ్వానించారు. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ నారా భువనేశ్వరి తో పాటు అల్పాహారం తీసుకున్నారు.
మహిళలతో కలిసి ఇంటిలో అల్పాహారం తీసుకున్న నారా భువనేశ్వరి
RELATED ARTICLES
