ePaper
Thursday, June 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మిట్టపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం -ఇద్దరికి గాయాలు

మిట్టపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం -ఇద్దరికి గాయాలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్24

బైరెడ్డిపల్లి గ్రామ పంచాయితీ కి చెందిన మిట్టపల్లి సమీపంలో ఒక కారు ,ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు గాయాలు అయిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.
బైరెడ్డిపల్లి నుండి విరూపాక్ష పురం కు వెళుతున్న ద్విచక్రవాహనం,విరూపాక్షపురం నుండి బైరెడ్డిపల్లి వైపు వస్తున్న కారు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న నాగిరెడ్డిపల్లికి చెందిన హనుమంతప్ప(55 ),
శంకరప్ప(60),లు రక్త గాయాలకు గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే 108 వాహన పైలెట్ గౌస్,ఏ.ఎన్. టి.పావని బాధితులకు ప్రధమ చికిత్స చేసి బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!