పలమనేరు, సెప్టెంబర్ 21 ( గరుడ ధాత్రి ) :
రెండు రోజుల పర్యటన నిమిత్తం సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం లభించింది. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో కుప్పం చేరుకున్న సీఎంకు హెలిప్యాడ్ వద్ద పలమనేరు శాసనసభ్యులు ఎన్. అమరనాథ్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమరనాథ్ రెడ్డి ముఖ్యమంత్రితో కొద్దిసేపు ముచ్చటించి నియోజకవర్గ పరిధిలోని తాజా పరిస్థితులను వివరించారు. ముఖ్యమంత్రి వెంట పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు. హెలిప్యాడ్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు చంద్రబాబు అభివాదం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి
RELATED ARTICLES
