ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రామగిరి ఆడికృత్తిక ఉత్సవాల్లో తప్పిపోయిన బాలుడు -సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగింత

రామగిరి ఆడికృత్తిక ఉత్సవాల్లో తప్పిపోయిన బాలుడు -సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగింత

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు జూలై 06 గరుడధాత్రి :
పిచ్చాటూరు మండలం రామగిరిలో జరిగిన ఆడికృత్తిక మహోత్సవాల సందర్భంగా తప్పిపోయిన ఓ బాలుడిని పోలీసులు అప్రమత్తంగా గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రవికుమార్, పిచ్చాటూరు ఎస్సై బి. రాఘవేంద్ర, నాగలాపురం ఎస్సై సునీల్ ఆధ్వర్యంలో పోలీసులు బాలుడిని గుర్తించి, తల్లిదండ్రులను గుర్తించిన అనంతరం వారికి అప్పగించారు.
భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించడంతో పాటు, తప్పిపోయిన బాలుడిని క్షేమంగా కుటుంబ సభ్యులకు చేర్చడం పట్ల భక్తులు పోలీసులను అభినందించారు.
ప్రజలు తమ చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రద్దీ ప్రాంతాల్లో పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టవద్దని పోలీసులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!