ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్శ్రీసిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

శ్రీసిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక “ఏపీ దర్శన్” కార్యక్రమంలో భాగంగా 2025 బ్యాచ్‌కు చెందిన 8 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు శనివారం శ్రీసిటీలో పర్యటించారు.
ఈ సందర్భంగా అధికారులు శ్రీసిటీ పారిశ్రామిక వాతావరణం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధిని పరిశీలించారు. అనంతరం ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ అయిన మొoడలేజ్ పరిశ్రమను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియలు, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన పొందారు.
శ్రీసిటీలో అమలవుతున్న పారిశ్రామిక విధానాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన అవకాశాలపై అధికారులు ఆసక్తి కనబరిచారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల నిర్వహణ విధానాలపై ప్రత్యక్ష అవగాహన కలిగిందని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!