ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సత్యవేడులో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

సత్యవేడులో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

సత్యవేడులో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

 

సత్యవేడు ఏప్రిల్ 20

గరుడధాత్రి న్యూస్ :

 

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు సత్యవేడులో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు పరుచూరి శివకుమార్ నాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 

అనంతరం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుని కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఆధునిక సాంకేతికతతో పారదర్శక పరిపాలన అందిస్తూ, మౌలిక వసతుల అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఆయన చూపుతున్న దూరదృష్టి రాష్ట్ర పురోగతికి దోహదపడుతోందన్నారు.

 

తరువాత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముందు గంగమిట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో పరమశివం, బీబీఎస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పామాంజి వాసు, కృష్ణయ్య యాదవ్, మురళి, లోకయ్య రెడ్డి, బాలరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!