ePaper
Sunday, June 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్1000 మంది తో ర్యాలీగా సభ కు తరలి వెళ్లిన దంపూరి భాస్కర్ యాదవ్..

1000 మంది తో ర్యాలీగా సభ కు తరలి వెళ్లిన దంపూరి భాస్కర్ యాదవ్..

📰 Generate e-Paper Clip

.
తిరుపతి, జూన్ 12 :
ఎన్డీఏ పాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన నమ్మకం అభివృద్ధి సంక్షేమం విజయోత్సవ సభకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, టీడీపీ 8 వ క్లస్టర్ ఇంచార్జ్ దంపూరి భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో 1000 పార్టీ నాయకులు కార్యకర్తలను వివిధ వాహనాలలో తీసుకెళ్లారు. మొదటగా శుక్రవారం 8వ క్లస్టర్ పరిధిలోని 28,30,31,36,37 డివిజన్ల నుండి 1000 మంది పార్టీ నాయకులు కార్యకర్తలతో దంపూరి భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో మొదట ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ 8 వ క్లస్టర్ ఇన్చార్జి భాస్కర్ యాదవ్ మాట్లాడు తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిరునామాగా మారబోతోందని, దేశంలోనే అభివృద్ధిలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు కాబోతోందని తెలిపారు. తెలుగుదేశం కు తిరుపతి తో ఎంతో విడదీయరాని బంధం ఉందని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే తిరుపతి అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఏది ఏమైనా ఈ మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తామంతా కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తామని భాస్కర్ యాదవ్ తెలిపారు. సభకు తరలి వెళ్లిన వారిలో బాలయ్య, గణపతి, రజిని కుమార్, మునికృష్ణ, గోవిందు ఆచారి, మునికుమార్, రవిశంకర్ యాదవ్, ఆవుల శ్రీనివాసులు, ఆముదాల తులసి, జయకుమార్, అశోక్, రాజయ్య, గజేంద్ర, రేఖ, మధు పార్టీ కార్యకర్తలు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!