ePaper
Monday, June 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సీఎం విజయ్ బర్త్ డే వేళ ఘోర విషాదం..

సీఎం విజయ్ బర్త్ డే వేళ ఘోర విషాదం..

📰 Generate e-Paper Clip

-ఏడుగురు మృతి, 40 మందికి సీరియస్.
తమిళనాడు తిరువళ్లూరు జిల్లా పెరియపాలయంలోని ఓ ప్రైవేట్ ఎక్స్ పోర్ట్ సీ ఫుడ్ యూనిట్ లో ప్రమాదవశాత్తు అమ్మోనియా గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు మృతి చెందారు.మరో 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం ఫ్యాక్టరీ పరిసరాల్లో అసోం, ఒడిషా, జార్ఖండ్ నుంచి వచ్చిన దాదాపు 120 మంది కార్మికులు నివసిస్తున్నారు. ఇవాళ ఆదివారం సెలవు కావడంతో వాళ్లంతా తమ ఇళ్లలోనే ఉన్నారు. దాంతో చాలామంది అస్వస్థతకు గురయ్యారు.పెరియపాలయంలోని సెయింట్ పీటర్స్ పాల్ సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఆ తర్వాత వేగంగా చుట్టుపక్కల ప్రాంతాలకు గ్యాస్ వ్యాప్తి చెందింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కార్మికులు చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు, జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. చాలా మందికి ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారిందని.. మరికొంతమందికి ముక్కులు, చెవుల నుంచి రక్తం వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!