ePaper
Monday, June 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

📰 Generate e-Paper Clip

టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేద రోగులకు ప్రాణదాతగా సేవలందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌కు హైదరాబాద్‌లోని షేక్‌పేట్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్ శ్రీ అన్నే శ్రీనివాసరావు రూ.1 కోటి విరాళాన్ని అందజేశారు.
ఈ మేరకు విరాళానికి సంబంధించిన డిడిని ఆదివారం తిరుపతిలోని టీటీడీ ఈవో నివాస కార్యాలయంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర కు అందించారు.
ఈ సందర్భంగా ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు ఉదారంగా రూ.కోటి విరాళం అందించిన దాత శ్రీ అన్నే శ్రీనివాసరావును ఈవో అభినందించి, వారి సేవాభావాన్ని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ ఎన్. సదాశివరావు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!