ePaper
Monday, June 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్20 ఏళ్లల్లో 600 సినిమాలు.. గ్లామర్ పాటలతో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్..

20 ఏళ్లల్లో 600 సినిమాలు.. గ్లామర్ పాటలతో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్..

📰 Generate e-Paper Clip

-చివరకు ఇండస్ట్రీకి దూరంగా..* 70, 80వ దశకాల్లో తన అద్భుతమైన నృత్యాలు, గ్లామర్‌తో వెండితెరను ఊపేసిన నటి జయమాలిని. ‘గుడివాడ వెళ్లాను.. గుంటూరు పొయ్యాను..’, ‘సన్నజాజులోయ్‌.. కన్నె మోజులోయ్‌..’వంటి ఎన్నో ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్‌తో అప్పట్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ఘనత ఆమెది. అప్పట్లో తన పాటలతో ఇండస్ట్రీని అల్లాడించింది. అంతేకాదు ఆమె నటించిన పాటలు అప్పటి కుర్రకారుకు పిచ్చెక్కించాయి. ఇక ఒక స్టార్ హీరో అంటే అందులో తప్పకుండా జయమాలిని స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. ఆమె పాట ఉంటే చాలు బ్లాక్ బస్టర్ హిట్టు అనే స్థాయికి ఆమె పాపులారిటీ పెరిగిపోయింది. 1958 డిసెంబర్ 22న మద్రాసులో జన్మించిన జయమాలిని అసలు పేరు ‘అలమేలు మంగ’. ఎనిమిది మంది సంతానంలో ఆమె చివరిది కాగా, అప్పటికే స్టార్ డాన్సర్‌గా రాణిస్తున్న జ్యోతిలక్ష్మి ఆమెకు స్వయానా అక్క. అక్క డ్యాన్స్ చూస్తూ పెరిగిన అలమేలు, కేవలం 12 ఏళ్ల వయసులోనే తన మేనమామ టి.ఆర్.రామన్న దర్శకత్వంలో వచ్చిన ఒక తమిళ చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు బి.విఠలాచార్య ‘ఆడదాని అదృష్

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!