ePaper
Wednesday, June 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా -ఎస్సీ యువతకు సువర్ణావకాశం

సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా -ఎస్సీ యువతకు సువర్ణావకాశం

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి :
సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూన్ 23వ తేదీ (మంగళవారం) ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నరసింహులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం అజయ్ (PM-AJAY) పథకం ద్వారా ఎస్సీ యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కల్పించే లక్ష్యంతో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఎస్సీ యువతీ యువకులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఈ ఉద్యోగ మేళా ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పొందాలని ఎస్సీ యువతీ యువకులకు ప్రిన్సిపాల్ నరసింహులు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!