ePaper
Tuesday, June 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రయివేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ కోరిన ఏపీడబ్ల్యూజేఎఫ్

ప్రయివేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ కోరిన ఏపీడబ్ల్యూజేఎఫ్

📰 Generate e-Paper Clip

-సానుకూలంగా స్పందించి ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్
తిరుపతి జూన్ 22 :
తిరుపతి జిల్లాలోని ప్రయివేటు విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ కల్పించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ (ఏపీబీజేఏ) సోమవారం జిల్లా కలెక్టర్ ను కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. దీనికి వెంటనే సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ లో మాట్లాడి, ఈ మేరకు ఆదేశాలు పంపాలని తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆదేశాలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ను కలసిన వారిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు గాజుల చెంగలరాయలు (గాంధీ – మనం),ఎపిబిజేఎ జిల్లా అధ్యక్షులు దాచేపల్లి కిరణ్,ఎపిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పానేటి చెంగల్రాయులు (ఆంధ్ర మనం), కోశాధికారి కె.శ్రీనివాస్ (ఆంధ్ర మనం) తిరుపతి నియోజకవర్గం ఫెడరేషన్ అధ్యక్షులు బాల సుబ్రహ్మణ్యం (ప్రజాశక్తి)జిల్లా జాయింట్ సెక్రటరీ కృష్ణ మూర్తి (ఆంధ్ర మనం),మీడియా కోఆర్డినేటర్ సుధీర్ (ప్రజాశక్తి), సీనియర్ జర్నలిస్ట్ మోహన్ రావు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!