ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసీనియర్ పెన్షనర్ దామోదర్ మృతి పట్ల సంతాపం

సీనియర్ పెన్షనర్ దామోదర్ మృతి పట్ల సంతాపం

📰 Generate e-Paper Clip

పలమనేరు, జూలై 21 ( గరుడ ధాత్రి ) :

పలమనేరు సీనియర్ పెన్షనర్, రిటైర్డ్ సీఈవో దామోదరం శెట్టి మృతి పట్ల పెన్షనర్స్ విభాగం జిల్లా అధ్యక్షులు ఎన్. సోమచంద్రారెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. దామోదరం పనిచేసిన కాలంలోను మరియు పదవీ విరమణ అనంతరం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఎనలేని సేవలందించారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా కూడా పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్ చెల్లింపులకు నిరంతరం సేవలందించారన్నారు. ఆయన మృతి పెన్షనర్ల సంఘానికి తీరని లోటన్నారు. ఆయనకు ఘన నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంకనూ సంతాపం తెలిపిన వారిలో పెన్షనర్ల ఉపాధ్యాయ నియోజకవర్గ అధ్యక్షులు నాగభూషణం, బి.గోవిందరెడ్డి, రామప్ప, పాపయ్య, కొండారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్యాంసుందర్ తదితరులున్నారు.

పట్టణ గాండ్ల సంఘం తరపున సంతాపం

పట్టణ గాండ్ల సంఘం తరపున ప్రతినిధులు దామోదరం మృతి పట్ల సంతాపం తెలిపి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని అందించారు.కార్యక్రమంలో ఆర్. రాజేంద్రన్,చంద్ర అనే బాలకృష్ణ,అమరేంద్రబాబు,టి.కె.షణ్ముఘం,అశోక్ కుమార్, ఎ.ఆర్.కుమార్,గణేష్, శ్రీనాధ్, కేశవ,మూర్తి,బాబు,బాలు,కోదండరామయ్య,సుబ్రహ్మణ్యం శెట్టి తదితరులు వున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!