ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్ల విరాళం

అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్ల విరాళం

📰 Generate e-Paper Clip

పలమనేరు, జులై 21 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు అర్బన్ సెక్టార్ పరిధిలోని 6 అంగన్వాడీ కేంద్రాలకు శ్రీపురం సీతారామయ్య, నాగమణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఫ్యాన్లను విరాళంగా అందజేశారు. ఐసిడిఎస్ కార్యాలయంలో సీడీపీఓ ఉమారాణి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ట్రస్ట్ ప్రతినిధులు సామాజిక బాధ్యతతో స్పందించి ఎద్దుల సంత వీధి, మసీద్ స్ట్రీట్, బొమ్మి దొడ్డి, నాగమంగళం, మరియు జి.కోటూరు అంగన్వాడీ కేంద్రాలకు ఈ ఫ్యాన్లను బహుకరించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ఉమారాణి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్న పిల్లలకు మెరుగైన వసతులు కల్పించాలనే సంకల్పంతో ట్రస్ట్ ప్రతినిధులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ సేగు నరసింహులు శెట్టి, ఎల్లంపల్లి నరేంద్ర బాబు, జయలక్ష్మి జువెలర్స్ సునీల్ రాథోర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా, సంబంధిత అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!