ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్చిత్తూరు అన్నా క్యాంటీన్ లో "ఎమ్మెల్యే మధ్యాహ్నం భోజనం

చిత్తూరు అన్నా క్యాంటీన్ లో “ఎమ్మెల్యే మధ్యాహ్నం భోజనం

📰 Generate e-Paper Clip

చిత్తూరు జూలై 27(గరుడ దాత్రి న్యూస్)

మంచి పనులు ఎవరైనా చేశారు అంటే.. అది కూటమి ప్రభుత్వం మాత్రమే అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా చిత్తూరు సంజయ్ గాంధీ నగర్ లోని అన్నా కాంటీన్ కు విచ్చేసి సామాన్య ప్రజలతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా భోజనం చేస్తున్న రోజు వారి కూలీలు, ఆటో డ్రైవర్ లతో మాట్లాడారు. భోజనం ఎలా ఉంది? కడుపు నిండా సరిపోతుందా ? రుచిగా ఉందా అని ఆరా తీశారు? ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తల్లికి వందనం, ఆటో డ్రైవర్ సేవలో నిధులు అందాయా అని అడిగారు. పేదవాడికి రూ. ఐదుకే అన్నం పెట్టె పథకాన్ని నాటి వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన 48 గంటల్లో చిత్తూరులో అన్నా కాంటీన్ ప్రారంభించామని గుర్తు చేశారు. పేదలకు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు కార్యక్రమంలో కమిషనర్ పి నరసింహ ప్రసాద్, కూటమి నాయకులు మోహన్ రాజ్, రాజేష్ కుమార్ రెడ్డి, లోకేష్ రెడ్డి, జయచంధ్ర నాయుడు, అనురాధ, సాధు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!