పిచ్చాటూరు జూలై 27 గరుడధాత్రి :
పిచ్చాటూరు మండలం నీరువాయి కొత్త హరిజనవాడ గ్రామ రైతులు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రైతులకు తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు పిచ్చాటూరు ఎంపీడీవో మహమ్మద్ రఫీకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, రహదారి లేకపోవడంతో రైతులు వ్యవసాయ పనులు నిర్వహించడంలో అనేక అవస్థలు పడుతున్నారని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని తెలిపారు. రైతుల సమస్యను అధికారులు అత్యవసరంగా పరిగణించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, రైతులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
రైతులకు రహదారి కల్పించాలని ఎంపీడీవోకు జనసేన నాయకుల వినతి
RELATED ARTICLES
