ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో వేగవంతంగా పారిశుధ్య పనులు

ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో వేగవంతంగా పారిశుధ్య పనులు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి జూలై 28 గరుడ దాత్రి న్యూస్

స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయ ఆవరణలో దానికి ఇరువైపులా ఉన్న డ్రెయిన్లు, కాలువల్లో పారిశుధ్య చర్యలను మంగళవారం ముమ్మరంగా నిర్వహించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముందుస్తు జాగ్రత్తగా ఈ పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో లీలా మాధవి డి ఎంపిడిఓ గఫూర్ పిడిఓ రెడ్డి ప్రకాష్ జ మాజీ ఎంపీటీసీ సభ్యుడు వెంకటరమణలు క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి నీరు సఫీగా పారేలా చర్యలు తీసుకున్నారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని పారిశుధ్య సిబ్బందికి అధికారులు పలు సూచనలు చేశారు.
ఈ పర్యవేక్షణలో స్థానిక పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!