ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పం ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానం ఎన్నటికీ మర్చిపోలేను

కుప్పం ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానం ఎన్నటికీ మర్చిపోలేను

📰 Generate e-Paper Clip

* కుప్పం ప్రజలే మా కుటుంబం.
* గుడుపల్లి మండలం, అగరం గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి.
* రాష్ట్రం బాగు కోసమే టిడిపి బిజెపి జనసేన కూటమి ఏర్పాటు.
కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గ ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానం ఎన్నటికీ మరిచిపోలేనని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గం లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు మంగళవారం గుడిపల్లి మండలంలో పర్యటించారు. మండలంలోని అగరం గ్రామంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ ముఖాముఖిలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ,
గత ప్రభుత్వంలో ప్రజలు ధైర్యంగా మాట్లాడిన పరిస్థితులు లేవన్నారు.టీడీపీ కార్యకర్తలు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారన్నారు. అయినా పార్టీ జెండా వదల్లేదు.రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయన్నారు. సుపరిపాలన అందిస్తారనే నమ్మకంతో ప్రజలు కూటమిని గెలిపించారన్నారు.
కుప్పం ప్రజలు నాపై చూపిస్తున్న అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని, కుప్పం ప్రజలే మా కుటుంబం అన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం సీఎం చంద్రబాబు డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమైతే కుటుంబానికి అండగా ఉండొచ్చు.పేదల కుటుంబాలను ఆదుకునేందుకే పీ4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే సూపర్ సిక్స్ విజయవంతంగా అమలు చేస్తున్నారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం గొప్ప విషయం. ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!