ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆడి కృత్తిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

ఆడి కృత్తిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం మండలంలో పేరు గడించిన చెక్కునత్తం పంచాయితీ కూసూరు గ్రామంలోని పెరిపల్లం శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి జాతర బ్రహ్మోత్సవ ఆహ్వానం గోడపత్రికలను ఆవిష్కరించారు. మంగళవారం దేవాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలను ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ మణి, మండల తెలుగు యువత అధ్యక్షులు కనకరాజు, కో యూనిట్ ఇన్చార్జ్ మునిరత్నం, బూత్ ఇన్చార్జిలు బాలు, వినోద్, ఆలయ కమిటీ సభ్యులు నాగవేలు, ఆర్ముగం, సుందర్, దేవరాజ్, మాదేశ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!