ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సింహాచలంలో 'గిరిప్రదక్షిణ'- పోటెత్తిన భక్తజనం

సింహాచలంలో ‘గిరిప్రదక్షిణ’- పోటెత్తిన భక్తజనం

📰 Generate e-Paper Clip

కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్):సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక గిరిప్రదక్షిణ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సూర్యోదయానికి ముందే తొలిపావంచ వద్దకు వేలాదిగా చేరుకున్న భక్తులు, 32 కిలోమీటర్ల గిరిప్రదక్షిణను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, గుజరాత్ నుంచి దాదాపు 6 నుంచి 7 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. భక్తుల రద్దీ దృష్ట్యా మొత్తం మార్గాన్ని 7 జోన్లు, 28 సెక్షన్లుగా విభజించి, పోలీసు, జీవీఎంసీ అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తి భావంతో భక్తులు గిరి ప్రదక్షణలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!